Realme P1: అందరికీ అందుబాటులో Realme P1..మంచి ఫీచర్లతో బెస్ట్ ఫోన్! 4 d ago

రియల్‌మీ బ్రాండ్ అంటే తెలియని వాల్లే లేరు. ఎందుకంటే అది అద్భుతమైన పనితీరుకు అంత ఫేమస్ మరి! ఫెంటాస్టిక్ ఫీచర్లతో బడ్జెట్ ధరలో Realme P1 మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంది. అందమైన అమోలెడ్ స్క్రీన్, మెరుపులాంటి పనితీరు, క్షణాల్లో ఛార్జింగ్.. గేమ్స్ ఆడాలన్నా, సినిమాలు చూడాలన్నా, ఫోటోలు తీయాలన్నా...అన్నింట్లోనూ ఈ ఫోన్ సూపర్ అసలు. ఇది బడ్జెట్‌లోనే బెస్ట్ ఫోన్. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి!
Realme P1 ఫీచర్లు:
ప్రాసెసర్: MediaTek Dimensity 7050
డిస్‌ప్లే: 6.67-అంగుళాల AMOLED FHD+
రిఫ్రెష్ రేట్: 120Hz
బ్యాక్ కెమెరా: 50MP మెయిన్ కెమెరా + 2MP మోనో కెమెరా
ఫ్రంట్ కెమెరా: 16MP
బ్యాటరీ: 5000mAh
ఛార్జింగ్: 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 14, Realme UI
వేరియంట్స్:
- 6GB RAM + 128GB స్టోరేజ్
- 8GB RAM + 128GB స్టోరేజ్
- 8GB RAM + 256GB స్టోరేజ్
కనెక్టివిటీ ఫీచర్లు:
- బ్లూటూత్ 5.2
- USB టైప్-C పోర్ట్
- Wi-Fi 5
- 5G, 4G డ్యూయల్ సిమ్
ఫోన్ రంగులు:
- పికాక్ గ్రీన్
- ఫీథెర్ బ్లూ
- ఫీనిక్స్ రెడ్
ప్లస్ పాయింట్స్:
- అమోలెడ్ డిస్‌ప్లే చాలా బాగుంటుంది.
- 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల చాలా తొందరగా చార్జ్ అవుతుంది.
- MediaTek Dimensity 7050 ప్రాసెసర్ కారణంగా గేమ్స్, మల్టీ టాస్కింగ్ స్మూత్ గా ఉంటుంది.
మైనస్ పాయింట్స్:
- చీకటిలో ఫోటోలు స్పష్టంగా రావు
- బ్లోట్వేర్ సమస్యలు(అంటే ఎక్కువ ప్రీ-ఇన్‌స్టాల్ యాప్‌లు)
- NFC లేదు
రియల్‌మీ ఫోన్‌లు సహజంగానే మంచి ఫీచర్లు కలిగి ఉంటాయి. ప్రస్తుతం Realme P1 ధర రూ.13,999 నుండి ప్రారంభం అవుతుంది. 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.14,999కు.. అదే 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే రూ.15,999కు వస్తుంది. బడ్జెట్ ధరకే స్పీడ్, స్టైల్, ఫీచర్స్ అన్నీ ఒకే ఫోన్‌లో వస్తున్నాయి. ఈ ఫోన్‌ని ఆన్లైన్ లో రియల్‌మీ వెబ్‌సైట్ లో లేదా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు..ఆఫ్‌లైన్ లో ఈ ఫోన్ దొరకడం కొంచెం కష్టమే. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునేవారికి ఈ ఫోన్ చాలా మంచి ఎంపిక.
ఇది చదవండి: ప్రీమియం ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ భారత్ మార్కెట్లోకి.. లాంఛ్ డేట్ ఎప్పుడంటే.?